చాపిరేవులలో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం

నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం మూడవ రోజుకు చేరింది. అడుగడుగునా జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడవ రోజు ప్రచారంలో భాగంగా చాపిరేవులలో వైయస్ జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ...ధర్మానికి, అధర్మానికి మధ్య నంద్యాల ఎన్నిక జరుగుతుందని అన్నారు. బాబు మాయమాటలకు మోసపోవద్దని వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top