రాజన్న పాలన సువర్ణయుగం

వరంగల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్
రాజశేఖర్ రెడ్డి పరిపాలన ఒక సువర్ణ యుగం అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
అభివర్ణించారు. దాన్ని తెచ్చుకొనేందుకు వరంగల్ ఉపఎన్నికతోనే మార్పు మొదలవ్వాలని
ఆయన అభిలషించారు. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా  మూడో రోజు బుధవారం నాడు  ఆయన అనేకచోట్ల
ప్రచారంచేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గీసుకొండలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. . ఈ సందర్భంగా వైఎస్ జగన్
...కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.



దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 లక్షల 60వేల ఎకరాల
భూములు పంచారని... అధికారంలోకి వచ్చాక ఎంత భూమిని పంపిణి చేశారనే విషయాన్ని
కేసీఆర్‌ ను గట్టిగా నిలదీయాలని సూచించారు. కేసీఆర్ అధికారం చేపట్టి 18 నెలలు అవుతోందని, ఈ కాలంలో
ఆయన ప్రజలకు పంచింది కేవలం 16వందల
ఎకరాలు మాత్రమేనని వైఎస్ జగన్ అన్నారు.

పేదరికానికి ప్రధానంగా రెండు కారణాలు
ఉన్నాయని వైఎస్ జగన్ వివరించారు. నిరుపేదలకు విద్య, వైద్యం గగన కుసుమం
అయిపోతున్నాయని, వాటి కోసమే అప్పుల పాలవుతారని ఆయనపేర్కొన్నారు. దీన్ని గమనించిన
దివంగత నేత వైఎస్సార్ ప్రజల కోసం ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకాల్ని
ప్రవేశ పెట్టారని జగన్ వివరించారు.



పత్తి పండించేందుకు రైతులు పడుతున్న కష్టాలు
చూడాలని..., ఒకసారి పత్తి పొలాలకు వస్తే
పరిస్థితి అర్థం అవుతుందన్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్ కి 4,100 వస్తుందని, అదే
రాజశేఖరరెడ్డి హయాంలో రూ.6,700 వరకూ వచ్చిన
విషయాన్ని గుర్తించాలని అన్నారు. 

రాజన్న పరిపాలించిన సువర్ణ యుగం తిరిగి రావాలంటే అది ఈ
ఉపఎన్నిక ద్వారా మార్పు మొదలవ్వాలని జగన్ వివరించారు.  పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కు ఓటు వేసి, ఆయన్ని గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు.

Back to Top