కేరళ వరద బాధితులకు వైయస్‌ జగన్‌ భారీ విరాళంవిశాఖ: కేరళ వరద బాధితులకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులకు తమ పార్టీ తరఫున రూ. కోటి విరాళం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోటి విరాళాన్ని కేరళ సీఎం సహాయ నిధికి పంపుతున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వరణుడి ప్రకోపానికి దేవభూమి కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను విచ్చిన్నం చేస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద నీటిలో మునిగిపోయిన ఊళ్ల పరిస్థితి ఇంకా దైన్యంగానే ఉంది. దీంతో ఎటుచూసినా హృదయ విదారక​ దృశ్యాలే కనపడుతున్నాయి. వరద బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా కొన్ని చోట్లకు మాత్రం సరైన సమయంలో చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించి..వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు.

తాజా ఫోటోలు

Back to Top