ప్లీనరీ తీర్మానాలు..ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ

హైదరాబాద్ః  వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తన నివాసంలో  పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ప్లీనరీలో ఆమోదించాల్సిన తీర్మానాలు,  ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ బలోపేతంపైనా చర్చించారు.  ప్లీనరీ ఏర్పాట్లు, కమిటీల గురించి అడిగి తెలుసుకున్నారు.  జూలై 8,9 తేదీల్లో వైయస్సార్సీపీ జాతీయస్థాయి ప్లీనరీ సమావేశం.... విజయవాడ, గుంటూరు మధ్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా జరగనుంది.


ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతలకు పిలుపునిచ్చారు.  టీడీపీ పాలనపై ప్రజల్లో అసహనం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ఎన్నికల వరకూ ప్రభుత్వంపై పోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్లీనరీలో సిద్ధం చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తీర్మానాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్లీనరీని సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీల నియామకంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. త్వర‌లో మ‌రోసారి ప్లీనరీ ఏర్పాట్ల సమీక్షపై నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. 


Back to Top