హైదరాబాద్) అసెంబ్లీలో సెక్సురాకెట్ అంశం మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ప్రజల మాన, ప్రాణాలతో ప్రభుత్వం ఆటలు ఆడుకొంటోందని మండి పడ్డారు. రుణాలు ఇచ్చి కట్టలేని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని,ఇందుకు సంబంధించి వీడియోలు కూడా తీసి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో అధికార పార్టీ నేతలే ఎక్కువ మంది ఉన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితుడితో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విదేశాలకు వెళ్లారు. విదేశాల నుంచి ఎమ్మెల్యే బోడె వచ్చారు కానీ.. నిందితుడు రాలేదు. కనీసం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను పోలీసులు ప్రశ్నించలేదు, , అరెస్ట్ చేయలేదు, ఏ-5 నిందితుడి ఆచూకీ లేడు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడికి సెక్స్ రాకెట్ తో సంబంధంముంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా ఆయన్ని అరెస్ట్ చేయరు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు మహిళలు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. డ్వాక్రా రుణాలను రూ.10 వేల కోట్ల రుణాలను ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇచ్చింది మాత్రం రూ.3,600 కోట్లు. సెక్సు రాకెట్ వ్యవహారంపై మూలం ఏమిటో తెలిసినా.. మభ్య పెడుతున్నారు. ఏపీలో అప్పులు కూడా పుట్టడం లేదు. అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు. 16 లక్షల 25 వేల మంది రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉన్నా 70 వేల మందికి ఇచ్చారు. ప్రభుత్వం మాట తప్పింది కాబట్టే ప్రజలు అప్పులు చేస్తున్నారు. మొత్తం నేరమంతా తెలుగుదేశం నాయకుల చుట్టూనే ఉంది. అటువంటప్పుడు చర్యలు గట్టిగా తీసుకోవాలి. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది