వైఎస్ జగన్ భయంతోనే...

అనుమతిపై దాగుడు మూతలు..!
ప్రత్యేకహోదా సాధన కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలుగుతమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈనెల 26 నుంచి వైఎస్ జగన్ గుంటూరు వేదికగా నిరవధిక నిరాహార దీక్షకు దిగుతుండడంతో అధికారపార్టీలో అలజడి మొదలైంది. ఈక్రమంలోనే హోదా ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు నాటకీయ పరిణామాలకు తెరదీస్తోంది. ఇందుకు ఉదాహరణే వైఎస్ జగన్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సమావేశం. 

వైఎస్ జగన్ ఫియర్..!
ఈనెల 15వ తేదీన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఎస్వీ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించ తలపెట్టిన ''రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహోదా ఆవశ్యకత'' సదస్సుకు ప్రభుత్వం  అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి నిరాకరించింది.  ప్రత్యేకహోదా-ఉద్యోగఅవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అనే అంశంపై మాట్లాడేందుకు వైఎస్ జగన్ సదస్సులో పాల్గొంటున్నారని తెలిసి..యూనివర్సిటీలో సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ఆఘమేఘాల మేద ఆదేశాలు జారీ చేసి ప్రత్యేకహోదాపై తన దృక్పథాన్ని చాటుకుంది.  

పోరాటాన్ని చూసి ఓర్వలేకే..!
యూనివర్సిటీలను రాజకీయ వేదికలుగా మార్చొద్దంటూ నీతులు వల్లెవేయడం టీడీపీకే చెల్లిందని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ ఎన్నికల సభను ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించారు.   గతేడాది జూన్ 4న చంద్రబాబును టీడీఎల్పీనేతగా ఎన్నుకునే సమావేశాన్ని వర్సిటీ సెనేట్ హాలులో  నిర్వహించారు. గత నెలలో ఏఐఎస్ఎఫ్  జాతీయసభలకు శ్రీనివాస ఆడిటోరియం కేటాయించారు. ఆఖరికి జూన్ 14వ తేదీన బాహుబలి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు అనుమతించారు. కానీ ప్రతిపక్షం నిర్వహించే సభలకు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం ఇదెక్కడి న్యాయమని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ పోరాటాన్ని చూసి ఓర్వలేక తెరచాటు రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top