శనగ రైతుల్ని ఆదుకోండి: వైఎస్ జగన్

 () బీమా సొమ్ము కోసం రైతుల ఎదురు చూపులు

() కుంటిసాకులతో వేల మందికి అన్యాయం

() శనగ రైతుల సమస్యల్ని
ప్రస్తావించిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్) సమస్యల్లో ఉన్న
శనగ రైతుల్ని ఆదుకోవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విన్నవించారు. వైఎస్సార్
జిల్లాలో బీమా సొమ్ములు అందక అవస్థలు పడుతున్నారని వివరించారు. అసెంబ్లీ లో
ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా వైఎస్ జగన్ 
ఈ సమస్యను ప్రస్తావించారు.

      2012 వ సంవత్సరానికి గాను రబీ సీజన్ లో రైతులు పంటను నష్టపోయారని
వివరించారు. ఈ సొమ్ము 2013 లో అందాల్సి ఉందని, కానీ ఇప్పటికీ బీమా సొమ్ములకోసం
ఎదురు చూస్తున్నారని చెప్పారు. మొత్తం 56 వేల మంది రైతులకు బీమా సొమ్ము అందాల్సి
ఉందని వివరించారు. దీని గురించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీద ఒత్తిడి
చేస్తే చివరకు ఇటీవల కొంత మేర నిధులు విడుదల చేశారని చెప్పారు. 29వేల మంది రైతులకు
మాత్రమే విడుదల చేశారని వివరించారు. మిగిలిన రైతులకు సంబంధించి దరఖాస్తుల్లో
లోపాలు ఉన్నాయని అంటున్నారని, అటువంటి సమస్యలు ఉంటే అప్పుడే చెప్పి ఉంటే
బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పుడు దరఖాస్తుల్లో లోపాలు అంటే రైతులు
అల్లాడిపోతున్నారని చెప్పారు.

      తీరా చేస్తే 29వేల మంది రైతులకు గాను రూ.132 కోట్లు ఇవ్వాల్సి
ఉండగా, రూ. 95 కోట్లు మాత్రమే  విడుదల
చేశారని చెప్పారు. అటువంటప్పుడు ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయని నిలదీశారు. ఇప్పటికైనా
చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూచించారు. 

Back to Top