కడప: వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కడప లోని రిమ్స్ వైద్యాలయాన్ని సందర్శించారు. స్థానిక నారాయణ కళాశాల హాస్టల్ లో ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థినిల మృతదేహాల్ని సందర్శించి, కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ ఘటన మీద జ్యూడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మృతదేహాలకు హైదరాబాద్ లో రీ పోస్టు మార్టమ్ నిర్వహించాలన్నారు. కళాశాలల యజమాని నారాయణ ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 నెలల్లో నారాయణ కాలేజీల్లో 11 మంది విద్యార్థులు మరణించారని, ఇంతమంది చనిపోతూ ఉంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో చంద్రబాబు కు భాగం ఉంది కాబట్టే, చూసీ చూడనట్లుగా ఉంటున్నాడని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. అభం శుభం తెలియని పిల్లల మీద అభాండాలు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. <iframe width="700" height="400" src="https://www.youtube.com/embed/py7oY4me9Oo" frameborder="0"/>