క్వారీ ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి


అమరావతి: కర్నూలు జి ల్లా ఆలూరు మండలం హత్తి బెళగల్‌లో క్వారీల వద్ద పేలుళ్లు సంభవించి 12 మంది మృతి  చెందడం పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా క్వారీల వద్ద రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత చర్యలు చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైయస్‌ జగన్‌ కోరారు.  
Back to Top