బాబు అవినీతిపై విచారణ జరిపించాలి

అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలకు ఎర
సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నాడు
బాబుకు సిగ్గు, శరం ఉంటే ..
ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి
ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో రెఫరెండంగా తీసుకుందాం
సవాల్ ను స్వీకరించే దమ్ముందా బాబు
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వైఎస్ జగన్

హైదరాబాద్ః రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ...అలా వచ్చిన బ్లాక్ మనీ సొమ్ముతో ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నాడని నిప్పులు చెరిగారు.  ఒక్కో ఎమ్మెల్యేకి 20 నుంచి 30 కోట్లు, మంత్రి పదవులు ఎరచూపుతున్నారని,  బాబు అవినీతిపై విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అవినీతి డబ్బులతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు దుర్మార్గాలను ఆపాలని గవర్నర్ కు చెప్పామన్నారు.  రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ సవాల్ చేస్తున్నాం. నీ దగ్గర అధికారం, డబ్బులు, పోలీసులు ఉన్నారు. కొన్ని ఛానళ్లు, పత్రికలు సపోర్ట్ పలుకుతున్నాయి. ఇంత ధన బలం, అధికారం ఉంది. అలాంటప్పుడు అనైతికంగా చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత ఎందుకు రాజీనామా చేయించడం లేదు. వారిని అనర్హులుగా ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేదని, ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకం లేకే తీసుకుపోయిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా కాపాడుతున్నాడని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. 

67 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది వెళ్లినంత మాత్రాన పార్టీకి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదని వైఎస్ జగన్ అన్నారు. బాబు చేస్తున్న పాపాలకి..ఆ12న మందిని ప్రజల దగ్గరకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  బాబుకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవమున్నా...సిగ్గు, రోశం ఏ కోశాన ఉన్నా పార్టీలోకి లాక్కున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఎవరికి ఓట్లేస్తారో, దేవుడు ఎవరికి దీవెనలు అందిస్తారో రెఫరెండంగా తీసుకుందామన్నారు. సవాల్ ను స్వీకరించే దమ్ము నీకు ఉందా అని వైఎస్ జగన్ బాబును ఛాలెంజ్ చేశారు.  
 
రాష్ట్రంలో అవినీతి ఏవిధంగా జరుగుతుందో గవర్నర్ కు వివరించామన్నారు. చంద్రబాబు  ఏరకంగా జీవోలు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు మేలు చేశారు. నిబంధనల ప్రకారం ఈబీసీలో రేట్లు పెంచే అవకాశం లేకున్నా...కొంత మంది కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఏవిధంగా లబ్ది చేకూర్చారో గవర్నర్ కు తెలియజేశామన్నారు. పెట్రోల్ , డీజిల్, స్టీల్ తక్కువకే దొరుకుతోంది. సాండ్ ఫ్రీగా లభిస్తోంది, సిమెంట్ ధరలు పెరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 22 విడుదల చేసి కాంట్రాక్టర్లకు రేట్లు పెంచే కార్యక్రమం ఏవిధంగా చేశాడో వివరించామన్నారు. 

పట్టిసీమలో ఎలాంటి స్టోరేజ్ కెపాసిటీ లేకపోయినా .... కేవలం డబ్బులు దండుకునేందుకు 22 శాతం ఎక్సస్ కు రూ. 1600 కోట్లలో  రూ. 500 కోట్లు లూటీ చేశారన్నారు. ఇసుక మాఫియాలో చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు నాకింత నీకింత అన్నట్లుగా  భాగాలు పంచుకుని ఏవిధంగా వేలకోట్లు తిన్నారో కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాజధాని ప్రాంతంలో  బ్రీచ్ ఆఫ్ ఓత్ ఆఫ్  సీక్రసీ, ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి చంద్రబాబు,మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు తీరని అన్యాయం చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పలానా చోట్ల రాజధాని వస్తుందని బాబుకు తెలిసి కూడా అది బహిర్గతం చేయకుండా తనకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే చెప్పాడు.  తన బినామీలు రైతుల నుంచి  భూములు కొన్నాక ... డిసెంబర్ లో అమరావతిలో రాజధాని అని ప్రకటన చేశాడు. మేలో ప్రమాణస్వీకారం చేస్తే డిసెంబర్ దాకా మిస్ లీడ్ చేశాడు. అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అంటూ గందరగోళం సృష్టించారు. బినామీలు అమరావతిలో భూములు కొన్నాక డిసెంబర్ లో ఇక్కడ వస్తుందని చెప్పాడు. చంద్రబాబు చేసిన మోసాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాక మరేమంటారని ప్రశ్నించారు. 

జోనింగ్ పద్ధతిని తీసుకొచ్చి చంద్రబాబు తన బినామీల భూములను కమర్షియల్ జోన్ లో పెట్టి, రైతుల భూములను అగ్రికల్చర్ జోన్ లో పెట్టారు. తద్వారా రైతులు భూములు అమ్ముకోలేని పరిస్థితిని తీసుకొచ్చి...తన బినామీల భూముల రేట్లు పెంచి అమ్ముకునేందుకు మాత్రం వెలుసులు బాటు కల్పించుకున్నారు. కరెంట్ తక్కువ రేటుకు అందుబాటులో ఉన్నా కూడా ప్రైవేటు వ్యక్తులతో ఎక్కువ  రేట్లకు కరెంట్ కొనుగోలు చేసే ఒప్పందం చేసుకున్నారు. దీన్ని  తప్పుబడుతూ ఇండియన్ ఎనర్జీ ఎక్స్ చేంజ్ ఏపీఈఆర్సీకి లెటర్ రాసింది. ఈవిషయాలన్నింటినీ గవర్నర్ కు వివరించామని వైఎస్ జగన్ చెప్పారు. 

నల్లధనం ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పు. మంత్రిపదవులు ఎరచూపడం మరో తప్పు. వైఎస్సార్సీపీ గుర్తుపై ఆఎమ్మెల్యేలు గెలిచారు. ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటేశారు. అలా గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కోవడం దుర్మార్గం. వారు రాజీనామా చేయకపోవడం,స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించకపోవడం ఎంతవరకు సబబు. ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉంది. చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను దిగజార్చుతున్న పరిస్థితికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. దీంతో పాటు ఈనెల 25న ఢిల్లీ వెళ్లి బాబు అవినీతి డబ్బులను ఎరగా చూపుతున్న వైనాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న విధానాన్ని ప్రధాని, రాష్ట్రపతి, ఇతర రాజకీయ పక్షాలకు వివరిస్తాం. లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం.స్పీకర్ కు లెటర్ ఇచ్చాం. ఇంతటితో ఇది ఆపబోం.  స్పీకర్ కూడా ఇందులో భాగస్వామి కాబ్టటి ఆయన వాళ్లను ఎలాగూ అనర్హులుగా ప్రకటించరు. గనుక కోర్టులో  కూడా పోరాడుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 
Back to Top