సీబీఐ విచారణకు డిమాండ్

-టీడీపీ సర్కార్ విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతోంది
-  ప్రమాదం కాదు.. హత్యేనన్న అనుమానం కలుగుతోంది
-దుర్ఘటనపై విచారణ జరిపిస్తేనే నిజాలు బయటకొస్తాయి
- ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
- ‘ఏర్పేడు’ బాధిత కుటుంబాలకు ప్రతిపక్షనేత పరామర్శ

తిరుపతి: ఏర్పేడు దుర్ఘటన లారీ ప్రమాదం వల్ల కాదనీ, పథకం ప్రకారం జరిగిన హత్యలేనని మృతుల కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అన్నారు. దుర్ఘటన జరిగిన రోజున పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును బట్టి సందేహాలు తలెత్తుతున్నాయని,ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ చేత విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మూడేళ్లుగా స్వర్ణముఖినదిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ నేతలు ధనుంజయలనాయుడు, చిరంజీవినాయుడులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కేసులు నమోదు చేయకపోవడం, మునగలపాలెం రైతులు ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు తహశీల్దార్‌ లేకపోవడం, పోలీస్‌స్టేషన్‌ గేట్లు మూసి రైతులను రోడ్డు మీద నిలబెట్టడం, ఆ తరువాత లారీ వచ్చి గుద్దేసి పోవడం చూస్తే.. దీని వెనుక కుట్ర కోణం కనిపిస్తోందన్నారు. బాధిత కుటుంబాలు, బంధువులు కన్నీటితో ఇవే సందేహాలను వ్యక్తం చేశారని వైయస్‌ జగన్‌ అన్నారు. ఆదివారం ఆయన ఏర్పేడు మండలం మునగలపాళ్యం, ముసిలిపేడు, రావెల కండ్రిగ గ్రామాలకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు.  మూడేళ్లుగా స్వర్ణముఖినదీ తీరంలో జరుగుతున్న ఇసుక దోపిడీని ప్రస్తావించి అధికార పార్టీ అరాచకాలను వైయస్ జగన్‌ ఎండగట్టారు. మునగల పాలెంలో వైయస్ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..

ఇసుకమాఫియాతో కుమ్మక్కు
‘‘గ్రామంలో ఎంతో విషాదం నెలకొంది. ఈ దారుణ పరిస్థితికి కారణం విశ్లేషిస్తే.. మూడేళ్లుగా పక్కనున్న ఏట్లో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎమ్మార్వో,  పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇదే నియోజకవర్గంలో 8 చోట్ల, జిల్లాలో 100 చోట్ల ఇసుక దందా సాగుతోంది. ఫిర్యాదు చేసేందుకు పోతే ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆరునెలల క్రితం సీపీఎం, వైయస్సార్‌ సీపీ నేతలు 600  ట్రాక్టర్లను, లారీలను, జేసీబీలను రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు, అయినా అధికారుల్లో చలనం రాలేదు. మునగల పాలెం పక్కన ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తులు హైలైట్‌ కావడం లేదు.మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ధనుంజయలనాయుడు, చిరంజీవి నాయుడు, మణినా యుడుల పేర్లు అందరూ చెబుతున్నారు.

ఎమ్మార్వో, పోలీసులు వీరితో కుమ్మక్కయ్యారు. ఈ కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందంటే..రైతులు ఫిర్యాదు చేసేందుకు పోతే అధికారులు కార్యాలయాల్లో ఉండరు. గేట్లు మూసేస్తారు. లేదా ఎక్కడికైనా పోతారు. ఏర్పేడులో దుర్ఘటన జరిగిన రోజు రైతులు రోడ్డు మీద ఎందుకున్నారంటే.. ఆసమయంలో వారిని లోనికి పోనీయకుండా పోలీస్‌స్టేషన్‌ గేట్లు మూశారు. ఎస్పీని కలుద్దామని పోతే బయటే ఉండమన్నారు. లోపల ఎస్పీ ఉండగానే రైతులకు ఈ అవమానం జరిగింది. తర్వాత లారీ వచ్చి గుద్దింది. లారీ ఢీకొట్టడం కాదు.. అది హత్యేనని బాధితులు చెబుతున్నారు. పథకం ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఎందుకు ధనుంజయలునాయుడు, చిరంజీవినాయుడులపై కేసులు నమోదు చేయలేదు? అసలు ఆ రోజు ఎస్పీ ఎందుకలా చేశారు.? ఎమ్మార్వో ఎందుకు ఆఫీస్‌లో లేకుండా పోయారు? ఇవన్నీ అనుమానాలే. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే పోలీస్, రెవెన్యూ అధికారులందరూ ఇసుక మాఫియాతో బాగా  కుమ్మక్కయినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో.. జరిగిన దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు బయటకొస్తాయి.  

మాఫియా నుంచి రూ.200 కోట్లు రికవరీ చేయాలి
ఒకవైపు బోర్లలో నీరులేదు. స్వర్ణముఖి నదిలో 30 అడుగులు, 40 అడుగులు విచ్చలవిడిగా తవ్వేయడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. దిక్కుతోచని పరిస్థితిలో రైతులు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పరిస్థితుల్లో ఏర్పేడు దారుణం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ప్రాణాలకు వెలకట్టి ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది. అసలు మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి? మూడేళ్లుగా ఇసుక దందాతో కోట్లు సంపాదించిన ధనుంజయలనాయుడు, చిరంజీవినాయుడుల నుంచి రూ.200 కోట్లు రికవరీ చేసి మృతుల కుటుంబానికో రూ.50 లక్షలు ఇవ్వాలి. అది కూడా సరిపోతుందని నేననుకోవడం లేదు. ఇవాళ నేను అడుగుతున్నా...ఏమయ్యా చంద్రబాబూ ! ఇసుక ఫ్రీ అంటున్నారు. ఇసుక నుంచి, మట్టి నుంచి కోట్లు గడించవచ్చన్న పరిస్థితిని ఇక్కడే చూస్తున్నాం. మంత్రుల కింత, ఎమ్మెల్యేలకింత, ముఖ్యమంత్రి కొడుకుకింతని కమీషన్లు తీసుకోవడం నేర్పిన ప్రభుత్వమిది. ఇసుక నుంచి దోపిడీ..మట్టినుంచి దోపిడీ..మద్యం నుంచి దోపిడీ...రాజధాని భూముల నుంచి దోపిడీ...చివరకు పోలవరం ప్రాజెక్టు నుంచీ దోపిడీనే. ఏది ముట్టుకున్నా కూడా లంచాలు, దోపిడీ, అవినీతే. ఆఖరికి ఎన్‌సీఏఈఆర్‌ ఏపీని అవినీతిలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ధృవీకరించింది.  అన్యాయాన్ని అరికట్టకపోతే తీవ్రంగా స్పందిస్తాం.

మీడియా కీలక పాత్ర పోషించాలి
మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌. ఇక్కడ మునగల పాలెం వాసులకు జరిగిన అన్యాయాన్ని బయటకు తేవాలి. అధికారులను ప్రశ్నించాలి. జరుగుతున్న అన్ని పరిణామాలకు ఆధారాలు చూపాలంటే ఎలా సాధ్యం? ఇదేమన్నా ఇన్వెస్టి గేషన్‌ ఏజెన్సీనా? ఇసుక దోపిడీకి పాల్పడుతోంది ధనుంజయలునాయుడు, చిరంజీవినాయు డులని గ్రామస్తులు చెప్పడం లేదా, కొన్నాళ్ల కిందట 600 లారీల ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నది నిజం కాదా, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం వాస్తవం కాదా..మొన్న గేట్లు మూసేసి రైతులు లోనికి రాకుండా చేయలేదా? ఇంతకన్నా ఏం కావాలి. నేనేమన్నా కెమెరాలు పెట్టి చంద్రబాబుకి డబ్బు లిచ్చే ఫోటోలు తీయాలా? అసలా రోజు ఎస్పీ ఎందుకలా చేశారు? ఎందుకు ఎమ్మార్వో తన కార్యాలయంలో లేడు, ఇవన్నీ సందేహాలు కావా? ఇసుక తరలింపునకు వ్యతిరేకంగా మా పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి 8 సార్లు ధర్నా చేశారు. అసలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి పోకుండా ప్రజలను ఎవరన్నా ఆపుతారా? మీడియా దీన్ని ప్రశ్నించాలి. ఇవన్నీ నేను అడగ లేదు. బాధితులు అడిగారు. గేట్లు మూసేశారు కాబట్టి లారీ ఢీకొట్టడానికి అవకాశం ఏర్ప డింది.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
Back to Top