వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

 వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యూఢిల్లీ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఉద‌యం పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి ఢిల్లీ కి బయల్దేరి వెళ్లారు.  సాయంత్రం  4.30 గంటలకు వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావలసిన నిధుల అంశాలకు సంబంధించి వైఎస్ జగన్ ప్రధానికి నివేదిస్తారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ అంశాలపై వైఎస్ జగన్ చర్చిస్తారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు జ‌రుగుతున్న అన్యాయం, నిధులు లేక కుంటుబ‌డుతున్న ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల ఇబ్బందుల్ని ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రికి, ఇత‌ర నాయ‌కుల‌కు వివ‌రిస్తారు.
Back to Top