వైఎస్ జగన్ సంతాపం

హైదరాబాద్: నాటక రంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు మృతిపట్ల  ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు నాటక రంగానికి ఆయన ఎనలేని కృషిచేశారని కొనియాడారు. ఆయన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన సేవలను తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ ఓ ప్రకటనలో తెలిపారు .

తీవ్ర అనారోగ్యంతో చాట్ల శ్రీరాములు ఇవాళ మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. చాట్ల శ్రీరాములు రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ 1976లో నాటక రంగానికి అంకితమయ్యారు. ఆయన దేశవిదేశాల్లో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు.
Back to Top