సోషల్ మీడియాలో దీక్ష భగ్నం సమాచారం

గుంటూరు: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేయటం, ఆ రాత్రంతా చోటు చేసుకొన్న పరిస్థితులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి జగన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించ సాగింది. కుటుంబ సభ్యులు విజయమ్మ, భారతి పక్కనే కూర్చొని సపర్యలు చేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో జగన్ వార్తలు బాగా ట్రెండ్ అయ్యాయి. టాప్ ట్రెండ్ గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు నిలిచింది.

ఫేస్ బుక్, ట్విటర్ లో వైఎస్ జగన్ వార్తలు పోటెత్తాయి. దీక్షకు స్పందించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, ప్రధాని కార్యాలయానికి పెద్ద ఎత్తున ట్వీట్ లు చేశారు. జాతీయ మీడియా స్పందించాలంటూ ఇంగ్లీషు చానెల్స్ కు సందేశాలు పంపించారు. ఇటు, ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తాయి. జగన్ కు సంబంధించిన పోస్టులను విపరీతంగా షేర్స్ చేశారు. తెల్లవారు జాము సమయంలో జగన్ దీక్షను భగ్నం చేసినప్పుడు ఆ వార్త బాగా ట్రెండ్ అయ్యింది.
Back to Top