వైఎస్ జగన్ దీక్ష@3వ రోజు..!

వెల్లువలా వస్తున్న జనంతో వైఎస్ జగన్ కరచాలనం..!
ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరింపు..!

గుంటూరుః ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా  తెలుగువారు వైఎస్ జగన్ దీక్షకు బాసటగా నిలుస్తున్నారు. ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ తోడుగా ఉంటున్నారు. 

చిద్విలాసంగా..!
అదే విధంగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థిసంఘాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు,రైతులు, కార్మికులు, శ్రామికులు సహా అన్ని వర్గాల ప్రజలు  దీక్షాప్రాంగణానికి కదం తొక్కుతున్నారు. వెల్లువలా వస్తున్న లక్షలాదిమంది ప్రజానీకాన్ని వైఎస్ జగన్ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉన్నారు. చేయి చేయి కలుపుతూ వారితో ముచ్చటిస్తున్నారు. జగన్ వద్దకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం కనబరుస్తున్నారు. అందరినీ ఆత్మీయస్వాగతం పలుకుతూ  వైఎస్ జగన్ అభివాదం చేస్తున్న తీరు... వేదిక వద్దకు వచ్చిన వారందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. 

దీక్షకు సంఘీభావం..!
రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం వైఎస్ జగన్ మొక్కవోని దీక్షతో పోరాడుతున్నారు. దీక్షాస్థలికి మూడ్రోజులుగా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తూ వైఎస్ జగన్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. వైఎస్ జగన్ తో ఫోటోలు దిగుతూ పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నారు
Back to Top