ఏడోరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏడోరోజు ప్రజాసంకల్పయాత్ర సోమ‌వారం వైయ‌స్ఆర్ జిల్లా దువ్వూరు నుంచి ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటలకు దువ్వూరు శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్రను ఆరంభించారు. ఎంకుపల్లి, జిల్లెల, కనగూడూరు, ఇడమడకల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. కానగూడూరులో జెండా ఆవిష్కరణతో పాటు బీసీ నాయకులతో వైయ‌స్‌ జగన్‌ ముఖాముఖీ కానున్నారు. అలాగే చాగలమర్రి శివారులో ఆయన ఇవాళ రాత్రి బస చేస్తారు.
 

Back to Top