ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 222వ రోజు

- క‌ట్ట‌మూరు క్రాస్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం
- సాయంత్రం జ‌గ్గంపేట‌లో భారీ బ‌హిరంగ స‌భ‌
 తూర్పుగోదావరి జిల్లా : ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీ ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర ఇవాళ్టికి 222వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం పెద్దాపురం మండలంలోని కట్టమురు క్రాస్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు. ఇవాళ జ‌గ్గంపేట మండలంలోని కాట్రావుల పల్లి క్రాస్‌, సీతా నగరం శివారు మీదుగా జగ్గంపేట వరకు  పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం జగ్గంపేటలో నిర్వహించే బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొంటారు. 

 తమ కష్టాలను తీర్చే పెద్దబిడ్డ వచ్చాడని..
ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకునేందుకు కాలిన‌డ‌క‌న వ‌స్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. జననేతలో తొణికిసలాడే ఆ వ్యక్తిత్వమే సామాన్యుడికి గురి పెంచుతోంది. ఆ భావనే కష్టాన్ని చెప్పుకోవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఓపిగ్గా జననేత వింటున్న తీరు విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. అందుకే జగన్‌ ప్రజా సంకల్పయాత్ర రోజురోజుకూ జన హృదయాలకు దగ్గరవుతోంది. పల్లె పల్లెకూ ఆత్మీయతను పంచుతోంది. తమ కష్టాలను తీర్చే పెద్దబిడ్డ వచ్చాడన్న అనుభూతి పేదల్లో ప్రస్ఫుటమవుతోంది. నాలుగేళ్లుగా పడుతున్న యాతనను విపక్ష నాయకుడికి వివరించడంతో సాంత్వన చేకూరిందని ఊరట చెందుతున్నారు. అభిమాన నేత వెంట అడుగులో అడుగేస్తూ అండగా నిలుస్తున్నారు. గురువారం సాగిన ప్రజా సంకల్పయాత్రకు నీరాజనాలు పలికారు. పాదయాత్ర సాగిన రోడ్డు మార్గంలోని ప్రజలంతా జననేతతో కలిసి కదం తొక్కుతున్నారు.  పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైయ‌స్‌ జగన్‌కు స్థానికులు సమస్యలు విన్నవించుకుంటున్నారు.  

Back to Top