అడుగడుగునా బ్రహ్మరధం




- 220వ రోజు  ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
- సాయంత్రం పెద్దాపురంలో భారీ బ‌హిరంగ స‌భ‌
 తూర్పుగోదావరి : వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు అడుగడుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైయ‌స్‌ జగన్‌కు స్థానికులు సమస్యలు విన్నవించుకుంటున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 220వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం నియోజకర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో కలిసి నడిచేందుకు  పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు.  పెద్దాపురం పట్టణంలోని బ్యాంక్‌ కాలనీ, మున్సిపల్‌ సెంటర్‌, పాత బస్టాండ్‌ సెంటర్‌, మరిడమ్మ తల్లి గుడి, వేములవారి సెంటర్‌, దర్గా సెంటర్‌ వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సాయంత్రం పెద్దాపురం వేములవారి సెంటర్‌లో నిర్వహించే బహిరం‍గ సభలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారు.

ఎవ‌రిని క‌దిలించినా క‌న్నీళ్లే!
చంద్ర‌బాబు పాల‌న‌లో మోస‌పోని వారంటూ ఉండ‌రు. ఎవ‌రిని క‌దిలించిన క‌న్నీళ్లే వ‌స్తున్నాయి. జాబిస్తానన్న బాబు మా భవితను బుగ్గిపాలు చేశాడ‌ని యువ‌కులు.. రుణమాఫీ.. వడ్డీ రాయితీ అని.. ఆనక నెత్తిమీద బండరాయి పెట్టాడ‌ని రైతులు.. పింఛన్లు ఇవ్వడం లేద‌ని వృద్ధులు.. సదరమ్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లేద‌ని దివ్యాంగులు..ఇలా ఒకటా.. రెండా.. ఎవరిని కదిపినా ఏదో ఒక గోడు.. నాలుగేళ్ల కష్టాలు నోట్లోకి నాలుగు వేళ్లూ పోకుండా చేశాయి. చంద్ర‌బాబు ఇచ్చిన హామీలకు ఆశపడి పాలనాధికారం అప్పజెప్పినందుకు మాకు కొలువు కాదు.. కూర్చునేందుకు కనీసం చాప కూడా లేకుండా చేశాడు.. నువ్వు రావాలన్నా.. మా కష్టాలు కడతేర్చాలన్నా.. యువత ఆశలుడిగి పూర్తిగా నిస్తేజంగా ఉన్నారన్నా.. భావి తరాలకు పైసా వెనకేసే పరిస్థితి లేదు.. మా దశ, దిశ నీవేనన్నా.. మా కాంక్షలు నెరవేర్చే నీవు సీఎం అవ్వాలన్నదే మా ఆకాంక్ష అని అన్నివర్గాల ప్రజలూ జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ వెతలను వినిపిస్తున్నారు. వారంద‌రికీ వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. 

Back to Top