దసరా శుభాకాంక్షలు

హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ  అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 'మీకు, మీ కుటుంబానికి శుభాలు కలగాలని ఆశిస్తూ విజయదశమి శుభాకాంక్షలు' అంటూ వైఎస్ జగన్ తెలుగులో ట్వీట్ చేశారు. దసరాల సందర్భంగా ఇప్పటికే విజయవాడ, ప్రొద్దుటూరు, బాసర సహా అనేక పుణ్యక్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. జన నేత వైయస్ జగన్ స్వయంగా ప్రొద్దుటూరు గుడికి వెళ్లి పూజలు నిర్వహించి వచ్చారు. 

Back to Top