ప్రజాసంకల్ప యాత్ర చరిత్ర సృష్టిస్తుంది

పాలకొండ రూరల్‌: మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ నియతృత్వ పాలన కొనసాగిస్తుందని దీనిని అడ్డుకునేందుకు వైయస్సాఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర ప్రజా సంకల్పంలోనుండి పుట్టుకువచ్చిందని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. శనివారం పాలరొండలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో అమె మాట్లాడారు. టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుండి సంక్షేమంకు విరుద్దంగా నడుస్తుందన్నారు. ఈ యాత్రతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న క్రమంలో అధికార పార్టీ అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తుందన్నారు. టీడీపీ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. జగన్‌ పాదయాత్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తుందని, ప్రజలు తమ ప్రియతమ నాయకుడిని చూసేందుకు, కష్టాలు చెప్పుకునేందుకు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారన్నారు. గతంలో ప్రజా సమస్యలపై పలు పోరాటాలు చేసిన జగన ఎప్పుడు కూడ శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించలేదన్నారు. 

Back to Top