సంగ్మా మృతికి వైయస్ జగన్ సంతాపం

 లోక్ సభ మాజీ స్పీకర్, మేఘాలయ
మాజీ ముఖ్యమంత్రి పీఏ సంగ్మా మృతి పట్ల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,
ఏపీ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో
బాధపడుతున్న సంగ్మా శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. సంగ్మా
మృతితో వైయస్ జగన్ దిగ్భ్రాంతి చెందారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంగ్మా అజాత శత్రువుగా
పేరుపొందారని, గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేశారని వైయస్ జగన్
కొనియాడారు.  ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు
ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top