నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు

విశాఖపట్నం)) గల్లంతైన విమానం ఆచూకీ
తెలుసుకొనేందుకు కేంద్రంతో మాట్లాడతామని, గాలింపు చర్యలు ముమ్మరం చేసేలా తమ వంతు
ప్రయత్నం చేస్తామని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ హామీ
ఇచ్చారు. విశాఖ నగరంలో బాధితుల కుటుంబాల్ని ఆయన పలకరించి సానుభూతి వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ విశాఖపట్నం పర్యటన ప్రారంభమైంది. మొదటగా 104 ఏరియాలోని భూపేంద్ర సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు. విమానం గల్లంతైన రోజు జరిగిన పరిణామాలపై  కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రక్షణ శాఖ ద్వారా జరుగుతున్న గాలింపు చర్యల వివరాలు తెలుసుకొన్నారు. “ఇటువంటి సంఘటనలు ఎంత బాధగా ఉంటాయో నాకు తెలుసు. అలనాడు వైయస్సార్ హెలికాప్టర్ మిస్ అయినప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాం. ఆ రోజు ఎంతో కష్టం అనభవించాం, ఆ కష్టం నాకు తెలుసు” అని వైయస్ జగన్ అభిప్రాయ పడ్డారు. పార్టీ తరపున కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

Back to Top