పులివెందులలో చనిపోయాడని రావడం లేదా..!

రైతుల ఆత్మహత్యలు కనబడడం లేదా..!
కళ్లు తెరిచి చూడు బాబు..!

పులివెందులః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పులివెందులలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అప్పుల బాధ తాళలేక మొట్నూతలపల్లెలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయలు అప్పు మాఫీ కాలేదు. డ్వాక్రారుణాలు మాఫీ కాలేదు. బోర్లు వేసి అప్పుల పాలయినా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో బతకలేని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి రాజశేఖర్ చనిపోతే... 18 రోజులైనా పాలకులుగానీ, అధికారులు గానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. చనిపోయిన రైతు రైతుగా కనబడడం లేదా లేక, చనిపోయింది పులివెందులలో కాబట్టి రావడం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని, రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ నిలదీశారు.  రైతులకు భరోసా ఇచ్చే పరిస్థితి ఎందుకు చేయడం లేదన్నారు. అనంతపురంలో జిల్లాలో 46 కటుంబాలను పరామర్శించానని .......అక్కడా పాలకులు ఒక్కరంటే ఒక్కరు బాధిత కుటుంబాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు ఎక్కడ కూడా  రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడంలేదని దుయ్యబట్టారు. వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు. 
Back to Top