వైయస్ జగన్ పరామర్శ

వైయస్సార్ జిల్లా)వైయస్సార్ జిల్లాలో మూడవ రోజు పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పులివెందులలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. అప్పుల బాధ తాళలేక చనిపోయిన రైతు కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించారు. లింగాల మండలం పెద్దకుడాలలో రైతు చలపతి కుటుంబాన్ని, చక్రాయపేట మండలం మద్దతిప్పవారిపల్లెలో రైతు చెన్నారెడ్డి కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించి ఓదార్చారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటానని వారికి భరోసా నిచ్చారు. 

కాగా, పంటలు నష్టపోయి, రుణాలు మాఫీకాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు మనోవేధనతో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం, బ్యాంకర్ల నుంచి వేధింపులు ఎక్కువవడంతో రైతులు తనువు చాలించడం ప్రతిపక్ష నేతను తీవ్రంగా కలచివేశాయి. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top