మహాశ్వేతాదేవి మృతిపట్ల సంతాపం

ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 

కోల్ కతా నగరంలో ఆమె కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆమెకు కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో లైఫ్ సపోర్ట్ మిషన్ల ఆధారంగా ఇన్నాళ్లు ప్రాణాలు నిలబెట్టగలిగినట్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు.1996లో మహాశ్వేతాదేవికి జ్ఞానపీఠ బహుమతి దక్కింది.
Back to Top