ఇస్రో శాస్త్రవేత్తలకు వైయస్‌ జగన్‌ అభినందనలు

చిత్తూరు: ∙పీఎస్‌ఎల్వీ సీ–40 ప్రయోగం విజయవంతం చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన ప్రయోగాలు చేయాలని ఆకాంక్షించారు. ఇవాళ శ్రీహరికోటలో పీఎస్‌ఎల్వీ సీ–40 ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు 31 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు. దీంతో 100 శాటిలైట్లు పంపి రికార్డు ఇస్త్రో సొంతం చేసుకుంది.  3 దేశీయ, 28 విదేశీ ఉప గ్రహాలను నింగిలోకి పంపించారు. కార్టోశాట్‌–3, ఈఆర్‌తో పాటు 31 ఉప గ్రహాలను స్వదేశానికి చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు, అమెరికా, బ్రిటన్, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, ప్రాన్స్, ఫిన్‌లాండ్, కెనడా దేశాలకు చెందిన 28 ఉప గ్రహాలను నింగిలోకి విజయవంతంగా చేరవేశారు.
 
Back to Top