ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

హైదరాబాద్: ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. ఆర్‌ఎల్వీ-టీడీ రాకెట్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సైంటిస్ట్ లను అభినందిస్తూ వైయస్ జగన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.   ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా రీ యూజబుల్ లాంచింగ్ వెహికల్-టెక్నికల్ డిమాన్‌స్ట్రేటర్(ఆర్‌ఎల్‌వీ-టీడీ)ని అంతరిక్ష వాహన నౌక ప్రయోగానికి ఇస్రో పదేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. తిరువనంతపురం సమీపంలోని విక్రమ్ సారాభాయ్ కేంద్రంలో ప్రయోగాలు చేపట్టింది. సుమారు 600మంది శాస్త్రవేత్తలు పదేళ్లుగా శ్రమించారు. మరోవైపు, ఆర్ఎల్వీ-టీడీ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.   
Back to Top