వైయస్ జగన్ అభినందనలు

హైదరాబాద్ః కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగల్, అసోం లో విజయఢంకా మోగించిన పార్టీలకు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గెలుపొందిన పార్టీలను అభినందిస్తూ వైయస్ జగన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడుతున్నాయి.  దీనిలో భాగంగానే కేరళలో గెలుపొందిన ఎల్డీఎఫ్ కు వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తమిళనాడులో అన్నాడీఎంకే చీఫ్ జయలలితకు వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వైయస్ జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా అసోంలో బీజేపీ సాధించిన విజయానికి గాను  ట్విట్టర్  ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. 

Back to Top