డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు వైయస్‌ జగన్‌ అభినందనలు

అగ్ని–4 మిస్సైల్‌ ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో చేయబోయే ప్రతి ప్రయోగం కూడా ఇదేవిధంగా విజయంవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. అగ్ని–4 క్షిపణిని ఒరిస్సా కోస్ట్‌లోని ధర్మా గ్రామంలో ఉన్న అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ నుంచి విజయవంతంగా నింగిలోకి పంపించారు. 20 మీటర్ల పొడవు 17 టన్నుల బరువైన ఈ క్షిపణి 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరగలదు. 

Back to Top