చిన్నారి తనుష్కను అభినందించిన వైయస్‌ జగన్‌


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆర్చరీ గోల్డు మెడలిస్టు చిన్నారి తనుష్క కలిశారు. ఈ సందర్భంగా ఆమెను వైయస్‌ జగన్‌ అభినందించారు. అండర్‌–9 విభాగంలో తనుష్క గోల్డు మెడల్‌ సా«ధించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని పెద్దకాపవరంలో చిన్నారి తనుష్క,ఆమె తల్లిదండ్రులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఆర్చరీలో మరిన్ని విజయాలు సాధించి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనుష్క మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ను కలవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. 
 
Back to Top