<br/> <br/>కర్నూలు: మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్ ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వివక్షత విడనాడి భవిష్యత్ తరాలకు సమసమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పూలే చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. <br/><br/>