యద్దనపూడి మృతిపట్ల వైయ‌స్ జ‌గ‌న్‌ సంతాపం

 హైదరాబాద్‌ : ప్రముఖ నవలా  రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. సులోచనారాణి తెలుగు పాఠకలోకాన్ని, నవలా రంగాన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేశారని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 

Back to Top