చెన్న‌మ‌నేని మృతిపై వైఎస్ జ‌గ‌న్ సంతాపం

హైదరాబాద్ :  ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,  సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు మృతి పట్ల వైయ‌స్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ చ‌రిత్ర‌లో చెన్న‌మ‌నేని పేరు చెప్పుకోద‌గ్గ‌ది. సుదీర్ఘ కాలం పాటు ఆయ‌న క‌మ్యూనిస్టు నాయ‌కుడిగా ఉద్య‌మాలు న‌డిపారు. జీవిత చ‌ర‌మాంకంలో ఆయ‌న పార్టీ మారటం జ‌రిగింది. తెలంగాణ పోరాటంలో చెర‌గ‌ని ముద్ర వేశారు. సిరిసిల్ల చేనేత కార్మికుల త‌ర‌పున పోరాటం చేశారు.  
చెన్నమనేని రాజేశ్వరరావు(93) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. చెన్నమనేనీ కుటుంబానికి వైఎస్ జ‌గ‌న్  ప్రగాఢ సానుభూతి తెలిపారు.విలువలకు కట్టుబడిన వ్యక్తి చెన్నమనేని అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

To read this article in English: http://bit.ly/276oA4K
 
Back to Top