విద్యాసాగర్ రావు మృతికి సంతాపం

హైదరాబాద్ః సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. విద్యాసాగర్ రావు కుటుంబీకులకు వైయస్ జగన్ తన ప్రగాడ సానూభూతి తెలిపారు. 

కాగా, విద్యాసాగర్ రావు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌(సీడబ్ల్యూసీ)లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ సర్కార్ ఆయన్ను సాగునీటి ముఖ్య సలహాదారుగా నియమించింది.
Back to Top