వైయ‌స్ జ‌గ‌న్ సానుభూతి

హైద‌రాబాద్‌) హైద‌రాబాద్ లోని ఫిలింన‌గ‌ర్ భ‌వ‌నం కూలిన ఘ‌ట‌న బాధితుల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌, వైయస్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ సానుభూతి ప‌లికారు. ఫిలిం న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ విస్త‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న సంద‌ర్బంగా శ్లాబ్ కూలిపోయింది. దీంతో నిర్మాణ ప‌నుల్లో ఉన్న ఇద్దరు కూలీలు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. ఏడుగురు దాకా గాయ‌ప‌డ్డారు. బాధిత కుటుంబాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ సానుభూతి తెలియ‌చేశారు. 
Back to Top