కార్టూనిస్ట్ మోహన్ మృతికి సంతాపం

హైదరాబాద్ః ప్రముఖ కార్టూనిస్టు మోహన్ మృతి పట్ల వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం తెలిపారు. తెలుగు పత్రికా రంగంలో మోహన్ ఓ ధృవతార అని వైయస్ జగన్ అన్నారు. కార్టూనిస్టుగా దశాబ్దాల పాటు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  మోహన్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన్ నేటి ఉదయం కన్నుమూశారు.

Back to Top