జయలలిత మృతికి సంతాపంగా నివాళులు

హైదరాబాద్ః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపంగా వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైయస్ జగన్, పార్టీ నేతలు నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.అమ్మ' అనేది అతి గొప్ప బిరుదని, జయలలిత నిజంగానే లక్షలాది మందిని ప్రేమగా లాలించే అమ్మగా నిలిచిపోయారని  వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆమెను ప్రేమించే వాళ్లందరికీ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వైయస్ జగన్ ఉదయం ట్వీట్ కూడా చేశారు.  
 
తమిళ ప్రజల ఆరాధ్య దైవం అయిన జయలలిత సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణ వార్తను తట్టుకోలేక తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోని ఆమె అభిమానులు గుండె పగిలేలా విలపిస్తున్నారు.

Back to Top