బాలాంత్రపు మరణం సాహితీ రంగానికి తీరని లోటు- వైయస్ జగన్ మోహన్ రెడ్డి

 ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి బాలాంత్రపు రజనీకాంతరావు (99) మరణం పట్ల వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  ఆయన మరణం సాహిత్య కళా రంగాలకు తీరని లోటు అన్నారు.  ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తెలుగుతల్లి ముద్దు బిడ్డల్లో  రజనీకాంతరావుగారు అగ్రగణ్యులని జగన్‌ అన్నారు. రేడియో జర్నలిజం ద్వారా కళలను, సాహిత్యాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లిన రజనీకాంతారవు చిరస్మరణీయులని పేర్కొన్నారు. 

Back to Top