లాహోర్ పేలుళ్ల ఘట‌న్ని ఖండించిన వైఎస్ జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌) పాకిస్థాన్ వాణిజ్య న‌గ‌రం లాహోర్ లో ఉగ్ర‌వాదులు మార‌ణ‌హోమానికి పాల్ప‌డ‌టంపై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉగ్ర‌వాదుల దుశ్చ‌ర్య ను ఆయ‌న ఖండించారు. పిల్ల‌లు సంచ‌రించే ప్రాంతంలో ఉగ్ర‌వాది ఆత్మాహుతి దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో 50 మంది దాకా చ‌నిపోయారు. జ‌న స‌మ్మ‌ర్థం అధికంగా గుల్ష‌న్ ఈ ఇక్బాల్ పార్కు నకు పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు, పిల్లలు త‌ల్లిదండ్రుల‌తో స‌హా వ‌చ్చారు. ఈస్ట‌ర్ పండుగ మ‌రియు ఆదివారం కావ‌టంతో సెల‌వుల్ని ఎంజాయ్ చేస్తున్న కుటుంబ స‌భ్యులు పెద్ద సంఖ్య‌లో చేరుకొన్నారు. అక్క‌డ పార్కింగ్ ప్రాంతంలో ఒక ఉగ్ర‌వాది త‌న‌ను తాను పేల్చుకోవ‌టంతో పెద్ద ఎత్తున మంటలు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో పిల్ల‌లు, మ‌హిళ‌లు ఎక్కువ సంఖ్య‌లో చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం. 
Back to Top