పాపాయపాలెం ఘటనపై వైఎస్ జగన్ ఆరా

హైదరాబాద్: గుంటూరు జిల్లా పాపాయపాలెంలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన బాంబు దాడి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. పాపాయపాలెం వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు.

గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో గురువారం టీడీపీ వర్గీయులు జరిపిన బాంబు దాడిలో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
Back to Top