తూర్పుగోదావరి కలెక్టరేట్ వద్ద వైఎస్ జగన్ ఆందోళన

ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేందుకు వైఎస్సార్సీపీ మరోసారి పోరుబాట పట్టింది. రెండేళ్లుగా హోదా పై రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన వైనాన్ని నిరసిస్తూ ఈనెల 10న కలెక్టరేట్ ల వద్ద వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్ధమైంది. పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొననున్నారు. 


ప్రత్యేక హోదా కోసం ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఆది నుంచి ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. హోదా కోసం వైఎస్ జగన్ చేయని పోరాటాలు లేవు. ప్రజలతో మమేకమై ప్రభుత్వాలపై పోరాడారు. రాష్ట్రంలో, ఢిల్లీలో దీక్షలు, ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు,  యువభేరి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా హోదా కోసం గుంటూరు వేదికగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.  ఐనా  కూడా టీడీపీ, బీజేపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. చావు కబురు చల్లగా చెప్పినట్లు రెండేళ్ల తర్వాత రాష్ట్రానికి హోదా లేదంటూ కేంద్రం రాష్ట్ర ప్రజానీకాన్ని వంచనకు గురిచేసింది. చంద్రబాబు చేతగానితనంతోనే రాష్ట్రానికి ఈదుస్థితి పట్టిందని ప్రజలు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.  
Back to Top