ప్రజా సంకల్పం @ 2,500 కి.మీ.

 
 మరో మైలురాయిని అధిగమించిన వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర

తూర్పు గోదావ‌రి: ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు, చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టేందుకు.. వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం మరో మైలురాయిని అధిగమించింది. వైయ‌స్ఆర్‌ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జననేత పాదయాత్ర.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధి మీదుగా తొమ్మిది జిల్లాల్లో విజయవంతంగా సాగింది. ప్రస్తుతం పదో జిల్లా అయిన తూర్పు గోదావరిలో కొనసాగుతోంది. ఆదివారం రాయవరం మండలం పసలపూడి చేరుకోగానే వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 2500 కిలోమీట‌ర్ల మైలు రాయిని చేరుకుంది.  ప్రజా ప్రస్థాన పాదయాత్ర సారథి, జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి, మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతి కూడా ఇదే రోజు కావడం విశేషం. ఈ సంద‌ర్భంగా వ‌ల‌స‌పూడి వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ వేప మొక్క‌ను నాటారు. అశేష జ‌నం వెంట రాగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top