ఏడు కొండ‌ల చెంత‌..700 కిలోమీట‌ర్లు



- 50 రోజులు పూర్తి అయిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- వైయ‌స్ జ‌గ‌న్‌కు తోడుగా అన్ని వ‌ర్గాలు
- రాజ‌న్న బిడ్డ‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న ప్ర‌జ‌లు
చిత్తూరు: ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. అలుపెరగని బాటసారికి ప్ర‌జ‌లు బ్రహ్మరథం పడుతున్నారు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువుదీరిన చిత్తూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 700 కిలోమీట‌ర్లు పూర్తి అయ్యింది.  ప్రజలతో మమేకవుతూ ముందుకు సాగుతోన్న జననేత జగన్ పాదయాత్ర మంగ‌ళ‌వారం 50వ రోజు పూర్తి అయ్యింది. పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌మ్మివారిప‌ల్లె చేర‌గానే 700 కిలోమీట‌ర్ల మైలు రాయిని వైయ‌స్ జ‌గ‌న్ దాటారు. ఈ సంద‌ర్భంగా పెట్రోల్ బంక్ స‌మీపంలో వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ జెండాను ఆవిష్క‌రించి, మొక్క‌ను నాటారు.

మొక్క‌వోని సంక‌ల్పం
ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌ని పాద‌యాత్ర ద్వారా గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించారు. ఈ యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న్మ‌దిన వేడుక‌లు, ప‌ర్వ‌దినాలు కూడా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్యే జ‌రుపుకుంటూ, వారితోనే గ‌డుపుతున్నారు. ప్ర‌తి వంద కిలోమీట‌ర్ల‌కు ఒక మొక్క‌ను నాటుతూ ముందుకు సాగుతున్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్‌ 6న కడప జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ప్రజాసంకల్పయాత్ర నవంబర్ 14న కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. క‌ర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో 100 కిలోమీటర్లు మైలురాయి, డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో 200 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటిన 21వ రోజు పాదయాత్రలో భాగంగా జననేత జగన్ 300 కిలోమీట‌ర్ల మైలు రాయిని కూడా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం బి.అగ్రహారం వద్ద పూర్తి చేసుకున్నారు. 29 రోజు పాదయాత్రలో భాగంగా అనంత‌పురం జిల్లా గుమ్మేపల్లిలో 400 కి.మీ మైలురాయిని చేరుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్లు, డిసెంబ‌ర్ 24న అనంత‌పురం జిల్లా ఉట్లూరు వ‌ద్ద 600 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటారు. ఇవాళ చిత్తూరు జిల్లా జ‌మ్మివారిప‌ల్లెలో 700 కిలోమీట‌ర్లు పూర్తి చేశారు. జననేతకు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీ సంఖ్యలో ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివస్తున్నారు. 

దారి పొడ‌వునా స‌మ‌స్య‌లే
ఇవాళ ఉదయం మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించారు. మార్గమధ్యలో వేరుశెనగ రైతులు ఆయనను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. గిట్టుబాటు ధర లేదని, సహకార నూనె కర్మాగారాన్ని మూసివేయించారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వారికి వైయ‌స్ జగన్‌ వారికి హామీయిచ్చారు. మరో ఏడాది ఆగితే రాజన్న రాజ్యం వస్తుందంటూ ఉత్సాహంతో ప్రజలు యాత్రకు మద్ధతుగా నిలుస్తున్నారు. 

Back to Top