గవర్నర్ కార్యాలయానికి వైఎస్ జగన్ ఫిర్యాదు

హైదరాబాద్) శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని చూస్తుంటే అసలు
నిజంగా..మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ఏం జరిగింది అనేది అందరూ చూస్తూనే
ఉన్నారని ఆయన అన్నారు.

అసెంబ్లీ దగ్గర ఎమ్మెల్యే రోజా ను ప్రభుత్వం అడ్డుకోవటంతో శాసనసభ దగ్గర వైఎస్
జగన్ నాయకత్వంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం తోటి ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్
కు వెళ్లి గవర్నర్ ను కలిసే ప్రయత్నం చేశారు. గవర్నర్ నరసింహన్ లేకపోవటంతో ఆయన
కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్ భవన్ దగ్గర వైఎస్ జగన్ మీడియాతో
మాట్లాడారు. 

Back to Top