విలువలకు కట్టుబడే ఉంటాం

  • నంద్యాలలో చంద్రబాబు అధికార దుర్వినియోగం
  • బాబు భయభ్రాంతులకు గురిచేసినా..
  • ధైర్యంగా ఓటేసిన ప్రజలకు నా కృతజ్ఞతలు
  • బాబు బెదిరింపులను తట్టుకొని నిలబడిన కార్యకర్తలకు నా అభినందనలు
  • పదవిని సైతం వదులుకొని వచ్చిన శిల్పా సోదరులకు హ్యాట్సాఫ్
  • ప్రలోభాలు, బెదిరింపులతో గెలవడం విజయం కాదు
  • 20మంది ఎమ్మెల్యేలను ఒకేసారి తీసుకొచ్చే దమ్ముందా..?
  • చంద్రబాబుకు వైయస్ జగన్ సవాల్
హైదరాబాద్ః  నంద్యాల ఎన్నికల్లో రూ.200కోట్లకు పైగా డబ్బులు వెదజల్లి, అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఓటర్లను ప్రలోభపెట్టి గెలవడం ఓ గెలుపే కాదని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతలను ఓటర్ల దగ్గరకు పంపించి ఇదిగో నీ ఆధార్ కార్డు, ఓటేయకపోతే పెన్షన్ కట్ అవుతుందని టీడీపీ నేతలు బెదిరించారన్నారు. అధికార టీడీపీ భయభ్రాంతులకు గురిచేసినా కూడ ధైర్యంగా ఓటేసినందుకు ప్రజలకు వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.  నంద్యాల ఎన్నికల్లో ఇన్ని ప్రలోభాలు, బెదిరింపుల మధ్య కార్యకర్తలు గట్టిగా నిలబడినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఎమ్మెల్సీ పదవిని వదులుకొని అధికార పార్టీ నుంచి వైయస్సార్సీపీలోకి వచ్చినందుకు శిల్పా సోదరులకు  వైయస్ జగన్ హ్యాట్సాప్ చెప్పారు. పదవి పోతుందని తెలిసి కూడ రాజీనామా చేసి మన పార్టీలో జాయినయి విలువలు అన్న పదానికి శిల్పా సోదరులు రాజకీయాల్లో అర్థం తీసుకొచ్చారన్నారు. వైయస్సార్సీపీ ఎవరికి కండువాలు కప్పాల్సిన పరిస్థితి వచ్చినా విలువలతో కూడిన రాజకీయాలే చేసిందని చెప్పారు. విలువలకు పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. 

చంద్రబాబు ఈ ఎన్నికలు విజయంగా భావించడమంటే దిగజారుడు రాజకీయమేనని వైయస్ జగన్ అన్నారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట తాము ప్రజలతో మమేకమయ్యామని చెప్పారు.  బాబు ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు, తర్వాత చేసిన మోసం గురించి ప్రజలను ప్రశ్నించినప్పడు వారి నుంచి  కూడ పూర్తి అవగాహనతో సమాధానాలొచ్చాయన్నారు. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు, ఆ తర్వాత ఏరకంగా మోసం చేసాడు. ఇంటింటికీ జాబ్ అన్నాడు. అధికారంలోకి వచ్చాక పిల్లలను ఏరకంగా మోసం చేశాడు..? రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం దగ్గర్నుంచి కరెంట్ బిల్లుల పెంపు వరకు బాబు చేసే ప్రతి మోసాన్ని ప్రజలే చేతులెత్తి మరీ చెప్పారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బాబు గెలిచాడంటే కారణం ఇది సాధారణ ఎన్నికలు కాకపోవడమేనన్నారు. బాబుకు వ్యతిరేకంగా ఓటేసినా వెంటనే అధికారం నుంచి తప్పుకోడు కాబట్టే నంద్యాల  ప్రజలు ఈ రకంగా ఆలోచన చేశారన్నారు. 

ప్రజలు చంద్రబాబుకు భయడి ఓట్లు వేస్తే గెలిచారే తప్ప ఇది ఆయన విజయం కాదన్నారు.  ఇది విజయమనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకొకరు ఉండరన్నారు. నంద్యాలలో ఒకే  చోట ఎలక్షన్ జరపడం , 200కోట్లు పెట్టడం, మంత్రులను కూర్చోబెట్టడం , ఓటర్లను భయభ్రాంతులు చేసి పోలీసులను వాడుకోవడం రెఫరెండం ఎలా అవుతుందని విలేకరుల అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వైయస్సార్సీపీ నుంచి తీసుకుపోయిన 20 మంది ఎమ్మెల్యేలతో ఒకేసారి రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని  బాబుకు వైయస్ జగన్ సవాల్ విసిరారు. అప్పుడు నీవు 20 చోట్ల 4వేల కోట్లు ఎలా పెడతావో, 20 చోట్ల పోలీసులు నీ మాట ఎలా వింటారో, నీవు ఎలా భయపెడతావో తెలుస్తుందన్నారు. ఒకచోట ఎలక్షన్ పెట్టి రెఫరెండం అనడం సరికాదన్నారు. మా పార్టీ గుర్తుపై గెలిచినవాళ్లను ఎన్నికలకు తీసుకొని రావాలని బాబుకు చురక అంటించారు. ఆ ఎమ్మెల్యేలను తమ గుర్తుపై గెలిపించుకునే ధైర్యం బాబుకు లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గుండె ధైర్యం ఉండాలన్నారు. అవతలివాడు
ఎన్ని దెబ్బలు కొట్టినా భరించగల ధైర్యం ఉండాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top