చంద్రబాబు మహారాజులా ఫీలవుతున్నారే..!

హైదరాబాద్) శాసనసభలో ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్దాల మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ సూటిగా
స్పందించారు. . ‘‘చంద్రబాబును సార్ అని పిలవాలేమో. ఆయన
మహారాజులా ఫీలవుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా?, రాచరికమా?. ’’ అని వైఎస్ జగన్ నిలదీశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా
తీర్మానం చేస్తూ చివర్లో చంద్రబాబు చేసిన అడ్డగోలు వ్యాఖ్యల మీద స్పందించేందుకు
స్పీకర్ సభలో అనుమతి ఇవ్వలేదు. దీంతో సభ బయటకు వచ్చాక వైఎస్ జగన్ మీడియా అడిగిన
ప్రశ్నలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మాకు
టీడీపీకి మధ్య 1.8 శాతం మాత్రమే ఓట్ల తేడా అని
గుర్తుంచుకోవాలి.సీఎం సహా
అధికార పార్టీ నేతలు  మాపై
ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవన్నీ స్పీకర్కు వినసొంపుగా ఉన్నాయా?. నేను బీద
అరుపులు అన్న పదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. నేను అన్నీ వాస్తవాలే
మాట్లాడాను. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తి చేసిన ఔటర్ రింగ్ రోడ్డు, ఎక్స్‑ప్రెస్ హైవే నిర్మాణం కూడా తన ఘనతే అని చంద్రబాబు
చెప్పుకుంటున్నారు’’ అనివైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.   చంద్రబాబు వైఖరి మీద వైఎస్ జగన్ సూటిగా
వ్యాఖ్యలు చేశారు.  

Back to Top