వైయస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకు వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం.. ఇవన్నీ మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశమని ఆయన పేర్కొన్నారు. 
 
క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు. క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 
Back to Top