నైతిక విజయం వైఎస్సార్సీపీదే


హైదరాబాద్) శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలదే నైతిక విజయం అని ప్రతిపక్ష
నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. శాసనసభలో బడ్జెట్
బిల్లును ప్రభుత్వం దొంగచాటుగా నెగ్గించుకొన్న తర్వాత మీడియాతో ఆయన చిట్ చాట్
చేశారు.

ద్రవ్య వినిమయ బిల్లు మీద డివిజన్ ఓటింగ్ కోరటం జరిగిందని వైఎస్ జగన్
చెప్పారు. పబ్లిక్ డిపాజిట్లను అత్తగారి సొమ్ము మాదిరిగా వాడుకొన్నారు. 22 వేల
కోట్ల రూపాయిల పబ్లిక్ డిపాజిట్లను దారి మళ్లించారు. ఎఫ్ ఆర్ బీ ఎమ్ ప్రకారం జీఎస్
డీపీ లో 3 శాతానికి మించి డిపాజిట్స్ ను తీసుకోకూడదు. కేంద్రం, ఆర్ బీ ఐ నిబంధనలు
ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిధి దాటి ప్రవర్తించింది. దీన్ని
వ్యతిరేకిస్తూ డివిజన్ ఓటింగ్ ను కోరామని వైఎస్ జగన్ చెప్పారు.

2014..15 కు సంబంధించి లెక్కలు చూపించలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. రుణ
మాఫీ, ఫింఛన్లు, హౌసింగ్ వంటి అంశాలకు సంబంధించి లెక్కల్లో తేడాలు ఉన్నాయని
పేర్కొన్నారు. అందుచేత వ్యతిరేకతను వెలిబుచ్చేందుకు ఓటింగ్ కోరినట్లు చెప్పారు. 

చంద్రబాబు చేసే పనులకు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. 2014..15 లెక్కల్ని
చూపించటం లేదు. ఎందుకంటే రూ.22 వేల కోట్ల రూపాయిల మేర పక్కదారి పట్టినందునే
చూపించటం లేదని  వైఎస్ జగన్ ఘాటుగా
వ్యాఖ్యానించారు. 

డివిజన్ ఓటింగ్ అడిగితే ఇవ్వకపోవటం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. ఇది చాలా
అన్యాయం అని వైఎస్ జగన్ వివరించారు. నిబంధనలు చదివి వినిపించినా స్పీకర్
పట్టించుకోలేదని చెప్పారు. అవినీతి సొమ్ముతో కొనుక్కొన్న వారిని కాపాడేందుకు
చేసుకొన్న ప్రయత్నం ఇది అని వైఎస్ జగన్ అభివర్ణించారు.  

Back to Top