వీరసైనికుల్లా పనిచేద్దాం.. వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుందాం

నెల్లూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకోవ‌డానికి ప్ర‌తీ నాయ‌కుడు, కార్య‌క‌ర్త వీర సైనికుల్లా ప‌నిచేయాల‌ని పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. ముందుగా దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ స‌మావేశానికి పార్టీ సీనియ‌ర్ నేత‌లు, ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మ‌ల్యేలు కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్‌, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, సంజీవ‌య్య‌, రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఆనం విజ‌య్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బ‌లోపేతానికి ప్ర‌తీ కార్య‌క‌ర్త కృషి చేయాల‌ని కోరారు. పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగించాల‌ని, అధికార పార్టీ చేస్తున్న ఆగ‌డాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. ఆత్మీయ స‌మావేశానికి పెద్ద సంఖ్య‌లో పార్టీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. 

Back to Top