చేనేత‌ల‌కు చేయూత‌నందిస్తా



- చేనేత‌ల ఆత్మీయ స‌మ్మేళనంలో వైయ‌స్ జ‌గ‌న్‌
- జాతీయ చేనేత‌ల దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న జ‌న‌నేత 
తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక చేనేత‌ల‌కు చేయూత‌నందిస్తాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. జాతీయ చేనేత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జననేతకు చేనేతలు మగ్గం అందజేసి నూలు దుస్తులతో సత్కరించారు. అనంత‌రం రాట్నం తిప్పి వస్త్రాన్ని నేశారు. చేనేతలను ఉద్దేశించి వైయస్ జగన్ ప్ర‌సంగించారు. చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. నష్టపోయిన వారికి భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. అంద‌రికీ అండ‌గా ఉంటాన‌ని జ‌న‌నేత హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చేనేతలకు వైయ‌స్ జ‌గ‌న్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. 

1. చేనేత కార్మికులను ఆదుకుంటాం.
2. తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తాం.
3. నూలుపై సబ్సిడీ చెల్లిస్తాం
4. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనార్టీ (బడుగు బలహీన వర్గాల ) పేదలందరికీ 45 ఏళ్లకే పింఛన్లు
5. ఫింఛన్‌ వెయ్యి నుంచి రూ.2 వేలు పెంచుతా
6. ఎన్నికల సమయంలో రైతులను, చదువుకుంటున్న పిల్లలను మోసం చేశాడని, అవ్వ, తాతలను, చేనేతలను వదిలిపెట్టలేదని చంద్రబాబు మోసాలను ఎండగట్టారు.
7. చేనేత కుటుంబాలకు అతి తక్కువ వడ్డికే రుణాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇవాళ చేనేత కుటుంబాలకు రుణాలు అందడం లేదన్నారు.
8. చేనేతలకు ప్రతి జిల్లాలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. ఏ జిల్లాలో కూడా చేనేత పార్కు కనిపించలేదన్నారు.
9. చంద్రబాబు పుణ్యమా అని చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చేనేతల ఆత్మహత్యలు పెరిగాయి.
10. ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయని, బట్టలకు మాత్రం ధర లేదని తెలిపారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు.
11. అన్ని వర్గాలకు అండ‌గా ఉంటా. అందుకే 45 ఏళ్లకే పింఛను.
12. ఆరోగ్యశ్రీని పునరుద్ధిస్తాం. హైదరాబాద్ లోనూ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం.
13. పేదవాళ్లకు ఇళ్లు కట్టి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు వారికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందజేస్తాం.
14. పిల్లలు చదువుకుంటేనే బతుకులు మారుతాయి. విద్యార్థులు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ప్రతి ఏటా 20వేలు మెస్ ఛార్జీలు చెల్లిస్తాం.
15. చేనేతల అభివ)ద్ధికి వైయస్ఆర్ ఎంతో చేశారు. వారి సమస్యలపై వైయస్ఆర్ వెంటనే స్పందించేవారు. 4ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా?
16. ప్రజలు కొడతారన్న భయంతో టీడీపీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టోను తీసేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అందరినీ మోసం చేశారు.
17. చేనేత కార్మికుల బ్యాంకు లోన్లు మాఫీ చేయలేదు.
18. బడ్జెట్ లో ప్రతి ఏటా వెయ్యికోట్లు అన్నారు.ఇచ్చారా?
19. ఇళ్లు కట్టిస్తామన్నారు. కట్టించారా?  వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తి ఒక్క‌రికి ప‌క్కాఇల్లు క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చారు. త్వరలో బీసీ గర్జన నిర్వహించి అన్ని బీసీ కులాల సమస్యలను మ్యానిఫెస్టోలో చేరుస్తామని వైయ‌స్ జగన్ ప్రకటించారు.

తాజా ఫోటోలు

Back to Top